: "ఆ 'ప్రభువు' సమాధానం చెప్పలేదు... ఈ 'ప్రభు' చేసి చూపుతాడు"... నవ్వులు పూయించిన రైల్వే మంత్రి


రైల్వే బడ్జెట్ ప్రతిపాదనల్లో భాగంగా తన పేరును తానే చెప్పుకున్న సురేష్ ప్రభు ప్రజా ప్రతినిధుల మధ్య నవ్వులు పూయించారు. "అత్యధికంగా రైళ్లు తిరుగుతున్న మార్గాల్లో కెపాసిటీని మెరుగుపరచాలన్నది మా ప్రాధాన్యతా అంశం. ఓ 'ప్రభూ' ఇది ఎలా సంభవం?" అని ఆయన అన్నారు. అనంతరం "ప్రభువు సమాధానం చెప్పలేదు. మనమే ఎందుకు కృషి చేయగూడదని ఈ 'ప్రభు' అనుకుంటున్నాడు" అన్నప్పుడు అధికార, విపక్ష సభ్యులు విరగబడి నవ్వారు. మంచి కవిగా, వక్తగా పేరున్న ఆయన బడ్జెట్ ప్రసంగం మధ్యలో హిందీ కవితలనూ వినిపించారు. "కుచ్ నయా జోడ్ నా హోగా, కుచ్ పురానా తోడ్ నా హోగా, కుచ్ ఇంజిన్ బదల్నె హోంగే, కుచ్ రిపేర్ కర్నె హోంగే" (కొత్తవి కావాలంటే, పాతవి వదులుకోవాలి. కొన్ని ఇంజన్లను మార్చాలి, మరికొన్ని మరమ్మతు చేయాలి) అని వివరించారు. మరో చోట అప్పర్ బెర్త్ గురించి వివరిస్తూ "నాలాంటి ముసలి వారు, మహిళలకు రిజర్వేషన్లు" అంటూ నవ్వులు పుట్టించారు. ఢిల్లీ, కోల్ కతాల మధ్య హై స్పీడ్ కారిడార్ గురించి ప్రస్తావిస్తూ, "ఇక పశ్చిమ బెంగాల్ కు చెందిన నా మిత్రులు త్వరగా ప్రయాణించవచ్చు" అన్నప్పుడు కూడా నవ్వుల వర్షం కురిసింది.

  • Loading...

More Telugu News