: మేడ్చల్ పాఠశాలలో అగ్ని ప్రమాదం... మీడియాపై దాడి


రంగారెడ్డి జిల్లా, మేడ్చల్ మండలం కండ్లకోయలోని నీరజ్ పాఠశాలలో ఈ మధ్యాహ్నం అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో భారీ ఆస్తినష్టం జరిగినట్టు తెలుస్తోంది. ప్రమాదాన్ని గురించి తెలుసుకోవడానికి వెళ్లిన మీడియా ప్రతినిధులపై పాఠశాల యాజమాన్యం దురుసుగా ప్రవర్తించింది. స్కూల్ యాజమాన్యం, సిబ్బంది మీడియా నుంచి కెమెరాలను లాక్కునే ప్రయత్నం చేశారు. తమపై దాడిచేసిన పాఠశాల ప్రతినిధులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. కాగా, ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.

  • Loading...

More Telugu News