: రైల్వే బడ్జెట్టుపై ట్విట్టర్ లో మోదీ స్పందన
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆధ్వర్యంలో రెండవసారి ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ పై ఆయన ట్విట్టర్ లో స్పందించారు. రైల్వే మంత్రి సురేశ్ ప్రభు ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ ముందు చూపుతో, భవిష్యత్ అవసరాలను తీర్చేలా ఉందని ప్రశంసించారు. ప్రయాణికుల సౌకర్యం, ఇతర లక్ష్యాలను చేరుకునేందుకు వీలుగా పక్కా ప్రణాళికతో, స్పష్టమైన విజన్ తో బడ్జెట్ ఉందని పేర్కొన్నారు. ప్రత్యేకంగా రైల్వేలో మొదటిసారి సాంకేతిక పరిజ్ఞానం, రైల్వేల ఆధునికీకరణకు ప్రాధాన్యత ఇవ్వడంపట్ల ఆనందిస్తున్నట్టు తెలిపారు. భారతదేశ ఆర్థిక వృద్ధిరేటు పెరుగుదలకు రైల్వే కీలకమయ్యేందుకు రైల్వే బడ్జెట్ స్పష్టమైన రోడ్ మ్యాప్ సూచిస్తుందన్నారు. మధ్యతరగతి ప్రజలపైనే రైల్వే బడ్జెట్ దృష్టి ఉంటుందని, వేగం పెంచడం, స్థాయి, సేవ, భద్రత అన్నీ ఒకే ట్రాక్ పై తీసుకొస్తుందని మోదీ ట్వీట్ చేశారు.