: ప్రణాళిక మాత్రం ఘనం... రూ.8.60 లక్షల కోట్లతో ప్రతిపాదనలు


వచ్చే నాలుగేళ్ళలో రూ.8,56,020 కోట్ల రూపాయలతో భారతీయ రైల్వేల్లో అభివృద్ధి ప్రణాళికలకు రూపకల్పన చేయనున్నట్టు ఆ శాఖ మంత్రి సురేష్ ప్రభు వివరించారు. ఇందులో రైలు మార్గాల విస్తరణకు రూ.1,99,320 కోట్లు, రైలు మార్గాల అభివృద్ధికి రూ.1,93,000 కోట్లు, ఈశాన్య రాష్ట్రాలకు మెరుగైన కనెక్టివిటీ కోసం రూ.39,000 కోట్లు, రక్షణకు (సిగ్నలింగ్, రైల్ ఓవర్ బ్రిడ్జీలు, రైల్ అండర్ బ్రిడ్జీలు, ట్రాకింగ్ తదితరాలు) రూ.1,27,000 కోట్లు కేటాయిస్తున్నట్టు తెలిపారు. వీటితో పాటు అధునాతన సాంకేతికత కోసం రూ. 5 వేల కోట్లు, కొత్త బోగీల తయారీ, ఉన్నవాటి నిర్వహణ నిమిత్తం రూ.1,02,000 కోట్లు, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాల కోసం రూ.12,500 కోట్లు, హైస్పీడ్ రైళ్ల కోసం రూ.65,000 కోట్లు, స్టేషన్ల అభివృద్ధి, లాజిస్టిక్ పార్కుల కోసం రూ.1,00,000 కోట్లు, ఇతర ఖర్చులకు రూ.13,200 కోట్లు కేటాయిస్తున్నట్టు సురేష్ ప్రభు వివరించారు.

  • Loading...

More Telugu News