: రైల్వేబడ్జెట్ ప్రధాన అంశాలు-3


కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు కొద్దిసేపటి క్రితం పార్లమెంట్ లో రైల్వే బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ పై లోక్ సభలో మంత్రి ప్రసంగం కొనసాగుతోంది. అందులోని ముఖ్యాంశాలు... - ప్రధాన నగరాల్లో శాటిలైట్ రైల్వే టెర్మినళ్ల ఏర్పాటు - హైస్పీడ్ రైళ్లపై అధ్యయనం - 16,600 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే లైను ఏర్పాటుకు అనుమతి - ఢిల్లీ-కోల్ కతా, ఢిల్లీ-ముంబైల మధ్య రైళ్ల వేగం పెంపు - కొత్తగా 4 సరకు రవాణా కారిడార్ల ఏర్పాటు - పర్యావరణ హిత లోకోమోటివ్ ల ఉత్పత్తికి ప్రాధాన్యం - రైళ్లు, రైల్వే స్టేషన్లలో అత్యుత్తమ పారిశుద్ధ్యం - విశ్రాంతి గదులను కూడా ఆన్ లైన్ లో బుక్ చేసుకునే వెసులుబాటు - రైల్వేలకు మరింత మేర ఎంపీ లాడ్స్ వినియోగించాలని పిలుపు - రైలు ప్రయాణ వేళల్లో జాప్యం లేకుండా చర్యలు - మూడు నెలల్లోగా అద్దెకు బోగీలు - ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు - మదన్ మోహన్ మాలవ్య పేరిట వారణాసిలో రైల్వే సాంకేతిక అభివృద్ధి కేంద్రం ఏర్పాటు - పరిశుభ్రమైన దుప్పట్లు, దిండ్ల సరఫరా - శతాబ్దిలో వినోద సౌకర్యం - ముంబై-అహ్మదాబాద్ మధ్య హైస్పీడ్ రైళ్లు

  • Loading...

More Telugu News