: మనస్తత్వాల్ని పట్టి ఇచ్చే 'లిఫ్ట్ ప్రయాణం'


లిఫ్ట్‌లో మనం ఎంత సేపు ప్రయాణిస్తాం. మహా అయితే కొన్ని క్షణాలు.. విపరీతం అయితే నిమిషాలు. అయితే ఆ కొద్ది సమయమే మన వ్యక్తిత్వానికి సంబంధించిన కొన్ని లక్షణాలను బయటపెడుతుంది. స్త్రీ పురుషులు ఒక్కొక్కరు , వయసులో తేడాలను బట్టి లిఫ్ట్‌లో ఎలా ప్రవర్తిస్తారు అనేదాన్ని బట్టి వారి ఆలోచనల్ని అంచనా వేసే ప్రయత్నం ఒకటి తాజాగా ఆస్ట్రేలియాలో జరిగింది.

మహిళలు ఏ వయసు వారైనా సరే.. లిఫ్ట్‌లోకి వెళ్లగానే వీలైనంత వరకు ముందు వరుసలోనే నిల్చోడానికి ప్రయత్నిస్తారట. లిఫ్ట్‌లో పరపురుషులు ఉన్నట్లయితే.. తాము వెళ్లినంత సేపు లిఫ్ట్‌ మానిటర్‌ వైపు మాత్రమే చూస్తుంటారట. లిఫ్ట్‌లో ఉన్నదంతా మహిళలే అయినప్పుడు మాత్రమే.. వారు అద్దంలో తమ అందచందాలను దిద్దుకునే పనిలో పడతారట. అంతకు మించి.. మహిళలు లిఫ్ట్‌ క్షణాల్లో మరో తీరుగా ప్రవర్తించే అవకాశం ఉండదట.

అదే పురుషుల్లో రకరకాలుగా ఉంటుంది. ముసలాళ్లు లిఫ్ట్‌లోకి రాగానే నేరుగా వెనుక వరసలోకి వెళ్లి నిల్చుంటార్ట. యువకులు ముందే నిల్చోవాలని ఆరాటపడతార్ట. లోనికి కాలుపెట్టగానే.. పురుషులు ముందు ఇతరుల్ని, తర్వాత మానిటర్‌ను, తర్వాత అద్దంలో తమ ప్రతిబింబాల్ని చూస్తూ గడుపుతారట. పురుషులు అద్దాలకేసి.. మహిళలు మానిటర్‌ కేసి చూస్తూ గడపడం సాధారణం అని.. అధ్యయనం చెబుతోంది. వారిలో భయంలేని తనం.. బెరుకు లాంటి లక్షణాలను ఈ ప్రవర్తన సూచిస్తుందేమో.

  • Loading...

More Telugu News