: జయలలిత అక్రమాస్తుల కేసు విచారణపై స్టే కోరుతూ డీఎంకే పిటిషన్
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ఏఐఏడీఎంకే అధినేత్రి జయలలిత అక్రమాస్తుల కేసు విచారణ తీరుపై డీఎంకే జనరల్ సెక్రెటరీ కె.అన్బగళన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో విచారణపై స్టే విధించాలని, ఈ కేసులో వాదిస్తున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలో చిత్తశుద్ధి లేదని, పక్షపాతంగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించారు. వెంటనే పిటిషన్ ను స్వీకరించిన కోర్టు, విచారణను రేపటికి వాయిదా వేసింది.