: డ్రగ్స్ వ్యవహారంతో తన భర్తకు సంబంధం లేదన్న గాయని
సినిహీరో నందుపై డ్రగ్స్ ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. సినీ నిర్మాత సుషాంత్ రెడ్డిని ఈ వ్యవహారంలో పోలీసులు అదుపులోకి కూడా తీసుకున్నారు. ఈ క్రమంలో, తనను అరెస్ట్ చేస్తారనే భయంతో నందు పరారీలో ఉన్నాడని పలు వార్తా ఛానళ్లు ప్రసారం కూడా చేశాయి. ఈ నేపథ్యంలో, మీడియా ముందుకు వచ్చిన నందు తాను పరారీలో లేనని, తానేం తప్పు చేయలేదని వివరణ కూడా ఇచ్చుకున్నాడు. ఈ నేపథ్యంలో, నందు భార్య, ప్రముఖ గాయని గీతా మాధురి తన భర్తకు డ్రగ్స్ రాకెట్ తో ఎలాంటి సంబంధాలు లేవని తెలిపింది. నందు చాలా మంచి వ్యక్తి అని, అసాంఘిక కార్యకలాపాలకు తాను పాల్పడడని చెప్పింది.