: మార్చిలో విడుదల... హ్యుందాయ్ నుంచి మరో కొత్త కారు ఐ20 యాక్టివ్
కొరియా కేంద్రంగా పనిచేస్తూ, ఇండియాలో అత్యధిక కార్లను విక్రయిస్తున్నా రెండో సంస్థగా గుర్తింపున్న ఆటోమొబైల్ కంపెనీ హ్యుందాయ్ వచ్చే నెలలో సరికొత్త కారు 'ఐ20 యాక్టివ్'ను భారత మార్కెట్లో విడుదల చేయనుంది. ఇప్పటికే ఈ కారును అంతర్జాతీయ మార్కెట్లోకి ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇండియాలో కనీసం 5 లక్షల యూనిట్లను విక్రయించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్టు హ్యుందాయ్ తెలిపింది. కాగా, యూరప్ లోని సంస్థ డిజైనింగ్ సెంటర్ లో 'ఐ20 యాక్టివ్'కు రూపకల్పన చేసిన సంగతి తెలిసిందే.