: గుంతకల్ లో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు... పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం


అనంతపురం జిల్లా గుంతకల్ రైల్వే డివిజన్ పరిధిలో నేటి ఉదయం ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో గూడ్స్ రైలుకు చెందిన ఏడు బోగీలు పట్టాలు తప్పాయి. దీంతో గుంతకల్లు మీదుగా రాకపోకలు సాగిస్తున్న పలు రైళ్ల రాకపోలకు అంతరాయం కలిగింది. మరికొద్ది గంటల్లో రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు కేంద్ర రైల్వే బడ్జెట్ ను ప్రతిపాదించనుండగా, ఈ ప్రమాదం చోటుచేసుకోవడం గమనార్హం.

  • Loading...

More Telugu News