: కళ్లల్లో కారం చల్లి, కత్తులతో గొంతు కోసి... నల్లగొండలో రౌడీ షీటర్ దారుణ హత్య
నల్లగొండలో నేటి ఉదయం ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. వరుస నేరాలకు పాల్పడి పోలీసు రికార్డుల్లో రౌడీ షీటర్ గా నమోదైన యూసుఫ్ అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత దారుణంగా హతమార్చారు. యూసుఫ్ పై మూకుమ్మడిగా దాడి చేసిన దుండగులు అతడి కళ్లల్లో కారం చల్లి, కత్తులతో గొంతు కోశారు. దుండగుల దాడిలో యూసుఫ్ అక్కడికక్కడే మృత్యువాతపడ్డాడు. మెరుపు వేగంతో యూసుఫ్ పై దాడి చేసిన దుండగులు దాడి అనంతరం అంతే వేగంగా పరారయ్యారు. మూడు కేసుల్లో యూసుఫ్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు.