: రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పగ్గాలు... ప్లీనరీలో అధికారిక ప్రకటన?
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆ పార్టీకి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. ఏప్రిల్ లో జరగనున్న పార్టీ ప్లీనరీలో భాగంగా పార్టీ నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనాలేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు సైతం డుమ్మా కొట్టి విశ్రాంతి పేరిట ఉత్తరాఖండ్ లో సేదదీరుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు పార్టీ అధ్యక్ష బాధ్యతలను సుదీర్ఘకాలంగా భుజానికెత్తుకున్న సోనియా గాంధీ పదవీ కాలం సెప్టెంబర్ తో ముగియనుంది. మరోమారు అధ్యక్ష బాధ్యతలను చేపట్టేందుకు ఆమె అంత ఆసక్తిగా లేరు. ఈ క్రమంలో రాహుల్ గాంధీని పార్టీ అధ్యక్షుడిగా ప్రకటించడమే ఉత్తమమన్న వాదన అటు పార్టీ అధిష్ఠానంతో పాటు ఇటు కేడర్ లోనూ వ్యక్తమవుతోంది.