: నేడే పార్లమెంటులో రైల్వే బడ్జెట్... తెలుగు రాష్ట్రాలకు కొత్త ప్రాజెక్టులు దక్కేనా?


నరేంద్ర మోదీ సర్కారు రైల్వే బడ్జెట్టును నేడు పార్లమెంటుకు సమర్పించనుంది. రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు ఇప్పటికే బడ్జెట్టుతో పార్లమెంటులో అడుగుపెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ బడ్జెట్టులో కొత్త ప్రాజెక్టులేమీ లేకున్నా, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకే ప్రాధాన్యమివ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రెండుగా విడిపోయిన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆశించినంత మేర కేటాయింపులు ఉండే అవకాశాలు లేవని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. రెండు రాష్ట్రాలకు రెండు రైల్వే జోన్ల ప్రకటన అయినా ఉంటుందా? అన్న అంశాన్ని ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. గత బడ్జెట్టులో ప్రకటించిన పలు ప్రాజెక్టులకు నిధుల కేటాయింపుపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది.

  • Loading...

More Telugu News