: నిర్మాతతో స్నేహం ఉన్నంత మాత్రాన డ్రగ్స్ రాకెట్ తో సంబంధం ఉందంటే ఎలా?: నందూ


హైదరాబాదులో డ్రగ్స్ మాఫియా వేళ్లూనుకుపోయింది. ఎన్నో ముఠాలను పట్టుకున్నా, వ్యాపారం మాత్రం సాగుతూనే ఉంది. తాజాగా ఓ డ్రగ్స్ రాకెట్ వెలుగుచూసిన సంగతి తెలిసిందే. ఈ రాకెట్ తో టాలీవుడ్ కు లింకులున్నాయంటూ మీడియాలో వార్తలు వచ్చాయి కూడా. దీనికి సంబంధించి సుశాంత్ రెడ్డి అనే దర్శకనిర్మాతను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, గాయని గీతామాధురి భర్త, వర్ధమాన నటుడు నందూకు కూడా ఈ రాకెట్ తో సంబంధం ఉందని ప్రచారం కావడం కలకలం రేపింది. దీంతో, నందూ ఈ ప్రచారాన్ని ఖండించాడు. ఓ వార్తా చానల్ స్టూడియోకు వచ్చి, తనపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవాలని పేర్కొన్నాడు. సుశాంత్ రెడ్డితో తాను 'సూపర్ స్టార్ కిడ్నాప్' అనే చిత్రం కోసం పనిచేశానని తెలిపాడు. నిర్మాతతో స్నేహం ఉన్నంత మాత్రాన తనకు డ్రగ్స్ రాకెట్ తో సంబంధాలున్నాయనడం సబబు కాదని అన్నాడు.

  • Loading...

More Telugu News