: ప్రియుడి సానుభూతి పొందేందుకు అమ్మాయి అతి తెలివి!


ప్రియుడి సానుభూతి పొందేందుకు ఓ అమ్మాయి డ్రామాకు తెరలేపింది. అయితే, అది ఫలించలేదు. తమిళనాడులోని కోయంబత్తూరులో ఓ 16 ఏళ్ల అమ్మాయి తనను నలుగురు సభ్యుల ముఠా కిడ్నాప్ చేసిందని కట్టు కథ అల్లింది. జుట్టు కత్తిరించి ఓ పొదలో పడేశారని పేర్కొంది. ఇలాగైనా ప్రియుడు సానుభూతి ప్రదర్శిస్తాడన్నది ఆమె ఆలోచన. కొంతకాలంగా ఆ యువకుడు సదరు అమ్మాయితో మాట్లాడడంలేదట. అతడిని మరలా తనవైపుకు తిప్పుకునేందుకు ఆమె ఈ ఎత్తుగడ వేసింది. పొదల వద్ద కనిపించిన ఆమెను స్థానికులు మహిళా పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చారు. అక్కడ, పోలీసులు గుచ్చిగుచ్చి ప్రశ్నించడంతో బండారం బయటపడింది. పోలీసు మార్కు ప్రశ్నలు అడగడంతో ఆ టీనేజి అమ్మాయి కన్ఫ్యూజ్ అయింది. మనస్పర్థల కారణంగా తన ప్రియుడు కొన్నాళ్లుగా టచ్ లో ఉండడంలేదని, అందుకే ఇలా చేశానని చెప్పింది. దీనిపై మందలించిన పోలీసులు అనంతరం ఆమెను తల్లిదండ్రులకు అప్పగించారు.

  • Loading...

More Telugu News