: ట్విట్టర్ ఖాతా తెరిచిన జగన్


వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ సోషల్ మీడియాలో ప్రవేశించనున్నారని కొన్నిరోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ప్రజలతో సన్నిహిత సంబంధాల కోసం ఆయన సోషల్ మీడియా బాట పట్టనున్నారని, పార్టీ నేతలు కూడా ఆయనకు ఈ విషయమై పలు విజ్ఞప్తులు చేశారని మీడియా పేర్కొంది. ఈ క్రమంలో ఆయన బుధవారం సాయంత్రం ట్విట్టర్ అకౌంట్ తెరిచారు. ఇకపై, కార్యకర్తలు, ఎన్నారైలు, ఇతరులు జగన్ తో తమ అభిప్రాయాలను పంచుకునేందుకు ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

  • Loading...

More Telugu News