: బడ్జెట్ పై ఆశలు పెట్టుకున్న షారుఖ్ ఖాన్


కేంద్ర బడ్జెట్ ను ఈ నెల 28న ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో, బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ స్పందించాడు. బాలీవుడ్ కు కూడా ప్రయోజనం చేకూరేవిధంగా బడ్జెట్ కేటాయింపులు ఉంటాయని ఆశిస్తున్నట్టు తెలిపాడు. చిత్ర పరిశ్రమను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పరిగణనలోకి తీసుకుంటారని భావిస్తున్నట్టు పేర్కొన్నాడు. తన టీవీ షో సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ షారుఖ్ పైవ్యాఖ్యలు చేశాడు. "అయినా, నేనో యాక్టర్ని. బడ్జెట్ గురించి నన్నడగడం ఏమిటి? బడ్జెట్ ను గౌరవిస్తాను. మన ఆర్థిక వ్యవస్థకు ఎంతో ముఖ్యమైనది" అని పేర్కొన్నాడు. ఈ ఏడాది బడ్జెట్ చిత్ర పరిశ్రమకు ఎంతోకొంత మేలు చేకూరుస్తుందని కచ్చితంగా చెప్పగలనని అన్నాడు.

  • Loading...

More Telugu News