: హమ్మయ్య! ఇప్పటికి ఓకే... ఊపిరి పీల్చుకున్న బాలీవుడ్!
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ పై కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన నిర్మాతలు తాత్కాలికంగా ఊపిరి పీల్చుకున్నారు. రాజస్తాన్లో కృష్ణ జింకలను వేటాడిన కేసులో కనీసం 2 నుంచి 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడొచ్చని ఊహిస్తుండగా, కేసు తీర్పు వచ్చేనెల 3కు వాయిదా పడడంతో, ఆయనతో సినిమాలు తీస్తున్న నిర్మాతలు "హమ్మయ్య! ఇప్పటికి ఓకే" అనుకుంటున్నారు. బాలీవుడ్ నిర్మాతలు హీరో సల్మాన్ పై సుమారు 200 కోట్లకుపైగా పెట్టుబడి పెట్టినట్టు తెలుస్తోంది. సంజయ్ మాదిరిగా, సల్మాన్ కూడా జైలుకు వెళితే, తమ సినిమాల పరిస్థితి ఏంటని వారు ఆందోళన పడ్డట్టు సమాచారం. తీర్పును వాయిదా వేయడంలో వారంతా ఊరట చెందారట. మార్చి 3న తీర్పు వెలువడినప్పటికీ, పై అపీలు నిమిత్తం పైకోర్టుకు వెళ్ళే అవకాశం ఉండటం నిర్మాతలకు మరింత రిలీఫ్ నిచ్చే అంశం. ప్రస్తుతం ఈ కండల వీరుడు ప్రస్తుతం అరడజనుకు పైగా ప్రాజెక్టులకు ఆమోదం తెలిపాడట. సూరజ్ భర్జాత్య దర్శకత్వంలో 'ప్రేమ్ రతన్ ధన్ పాయో' షూటింగులో బిజీగా ఉన్నాడు. కబీర్ ఖాన్ దర్శకత్వంలోని 'భజరంగి భాయ్' చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ రెండు సినిమాలపైనే రూ.150 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టినట్టు బాలీవుడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.