: పాక్ క్రికెటర్ యూనిస్ ఖాన్ కు షాకిచ్చిన ట్విట్టర్ ఫేక్ అకౌంట్


ప్రపంచకప్ ప్రారంభమయినప్పటి నుంచి పాకిస్థాన్ టీమ్ కు ఏదో ఒక సమస్య తలెత్తుతూనే ఉంది. దాయాదుల పోరులో భారత్ చేతిలో చిత్తుగా ఓడి, అభిమానుల ఆగ్రహావేశాలకు గురైంది. దీనిపై పాక్ కోర్టులో ఓ వ్యక్తి కేసు కూడా వేశాడు. మరో వైపు ఆటగాళ్లకు, కోచ్ లకు కూడా సరైన సంబంధాలు లేవు. ఈ క్రమంలో పాక్ స్టార్ బ్యాట్స్ మెన్ యూనిస్ ఖాన్ కు దిమ్మతిరిగే ఘటన ఒకటి జరిగింది. గుర్తు తెలియని ఓ వ్యక్తి... యూనిస్ పేరు మీద ట్విట్టర్లో ఓ ఫేక్ అకౌంట్ ఓపెన్ చేశాడు. చేస్తే చేశాడు, ఇంతటితో ఆగితే సరిపోయేది... వరల్డ్ కప్ తర్వాత వన్డేల నుంచి రిటైర్ అవుతున్నానంటూ ట్వీట్ కూడా చేశాడు. యూనిస్ రిటైర్ అవుతాడన్న వార్త క్షణాల్లో వ్యాపించింది. దీంతో షాక్ తిన్న యూనిస్ ఖాన్... అసలు తనకు ట్విట్టర్ అకౌంటే లేదని, ఇదంతా ఎవరో ఆకతాయి చేసిన పని అంటూ వివరణ ఇచ్చాడు.

  • Loading...

More Telugu News