: మమతా బెనర్జీకి మంగళగిరి చేనేత చీరలు


ప్రఖ్యాతిగాంచిన గుంటూరు జిల్లా మంగళగిరి చేనేత చీరలపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మనసు పారేసుకున్నారు. నూలుతో తయారైన తెల్లని రంగు అంచు ఉన్న చీరలనే ఆమె ధరిస్తారు. అందుకే చేనేత మగ్గంపై తయారైన చీరలు తనకు కావలని దీదీ కోరారు. దాంతో మంగళగిరిలో చేనేత మగ్గంపై వాటిని ప్రత్యేక్యంగా తయారు చేయించారట. తెలుపు, పసుపు, నీలం, ఆకుపచ్చ వంటి పలు రంగు అంచులతో చేనేత కార్మికులు ఆ చీరలు తయారు చేశారు. సుమారు 50 చీరలు పశ్చిమబెంగాల్ కు పంపుతున్నారని తెలిసింది. మరో 50 చీరలకు ఆర్డరు ఇచ్చారని, వచ్చే వారంలో వాటిని పంపుతామని చేనేత వస్త్ర ఉత్పత్తిదారులు చెప్పారు.

  • Loading...

More Telugu News