: గేల్ పరుగుల సునామీ వెనుక 'జలంధర్'


స్వదేశంలో తయారైన వస్తువుల కంటే విదేశాల్లో తయారైన వస్తువులకే ఎక్కువమంది భారతీయులు మొగ్గుచూపుతుంటారు. వాటి నాణ్యత కన్నా 'ఫారిన్' ట్యాగ్ కు ప్రాధాన్యత ఇస్తుంటారు. అయితే, పరిస్థితిలో మార్పు వచ్చింది. కొంతకాలంగా భారత్ లో తయారైన వస్తువులు ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఆదరణకు నోచుకుంటున్నాయి. అలాంటి వాటిలో క్రికెట్ బ్యాట్లు కూడా ఉన్నాయి. కొన్నాళ్ల వరకు ఇంగ్లీష్ విల్లోతో తయారైన బ్యాట్లనే అధికంగా వినియోగించేవారు. భారత్ లో మాత్రం కాశ్మీర్ విల్లోతో తయారైన బ్యాట్లదే హవా. ఇప్పుడా కాశ్మీర్ విల్లో నాణ్యతను విదేశీ బ్యాట్స్ మెన్ కూడా గుర్తించారు. కాస్త బరువు ఎక్కువైనా, మెరుగైన స్ట్రోక్ లభిస్తుండడంతో వారు భారత్ తయారీ బ్యాట్ల కోసం ఆర్డర్లు ఇస్తున్నారు. వారిలో క్రిస్ గేల్ ఒకడు. ఈ కరీబియన్ డాషింగ్ ఓపెనర్ 'స్పార్టన్' బ్యాట్లతో కొన్నాళ్లుగా ఆడుతున్నాడు. పంజాబ్ లోని జలంధర్ లో స్పార్టన్ క్రికెట్ ఉపకరణాల తయారీ పరిశ్రమ నెలకొని ఉంది. తాజాగా, గేల్ జింబాబ్వేపై డబుల్ సెంచరీ చేసింది కూడా భారత్ మేడ్ బ్యాటుతోనే. తన బ్యాట్లు హెవీగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పి మరీ చేయించుకున్నాడట గేల్. భారీకాయుడైన గేల్ కాస్త బరువున్న బ్యాట్లే కావాలని కోరాడని 'స్పార్టన్' సంస్థకు చెందిన అమిత్ శర్మ తెలిపారు. రెండేళ్లుగా గేల్ తమ బ్యాట్లనే ఉపయోగిస్తున్నాడని చెప్పారు. టీమిండియా కెప్టెన్ ధోనీ, ఆస్ట్రేలియా సారథి మైకేల్ క్లార్క్, ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కూడా తమ బ్యాట్లే వాడుతున్నారని శర్మ తెలిపారు.

  • Loading...

More Telugu News