: అద్వానీని అభినందించిన సోనియాగాంధీ... ఇద్దరికీ ఈరోజు ప్రత్యేకమైన రోజే
బీజేపీ సీనియర్ నేత అద్వాని ఈ రోజు 50వ పెళ్లిరోజు వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా అద్వానీకి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ శుభాకాంక్షలు తెలిపారు. "అద్వానీ, ఆయన సతీమణి కమల అద్వానికి అభినందనలు. 50 ఏళ్ల వైవాహికబంధాన్ని పూర్తి చేసుకున్న వీరిద్దరూ ఆదర్శ దంపతులు. ఇన్నేళ్ల పాటు కష్ట, సుఖాల్లో ఒకరికొకరు తోడుగా నిలిచి, అందరికీ ఆదర్శంగా నిలిచారు" అని తెలిపారు. ఈ సందర్భంగా, లిఖితపూర్వకమైన అభినందన పత్రాన్ని అద్వాని దంపతులకు సోనియా పంపారు. ఇదే సమయంలో మరో విషయాన్ని కూడా సోనియా గుర్తు చేసుకున్నారు. సరిగ్గా 47 సంవత్సరాల క్రితం రాజీవ్ గాంధీని తాను పెళ్లాడానని తెలిపారు.