: 5 రోజులు రిహార్సల్స్ చేసి ఆత్మహత్య చేసుకున్న నలుగురు


ఒకే కుటుంబంలోని నలుగురు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ముంబైలో జరిగింది. అయితే, వీరు ఆత్మహత్య చేసుకోవాలని ముందే నిర్ణయించుకుని, 5 రోజుల పాటు రిహార్సల్స్ చేశారని తెలుస్తుండటం సంచలనం సృష్టించింది. ముంబైలోని పశ్చిమ అంధేరీ ప్రాంతంలో ఈ ఘటన జరుగగా, మృతులు తాము ఎందుకు చనిపోవాలని అనుకుంటున్నదీ స్పష్టంగా చెబుతూ, వీడియో రికార్డింగ్ చేయడం గమనార్హం. అక్కా తమ్ముళ్ళయిన భారతీ పాల్ (25), సోమనాథ్ కార్తీక్ పాల్ (20)లు వారి బాస్ ఇంట్లో, వాళ్ల అమ్మ షికా పాల్, పెంపుడు తండ్రి మనోజ్ అజిత్ కుమార్ పటేల్ లు లోఖండ్ వాలాలోని అపార్ట్ మెంట్ లో ఒకే తరహాలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. భారతీ తన సూసైడ్ వీడియోలో ఉన్నతాధికారిపై ఆరోపణలు చేసింది. తన బాస్ టింకు సింగ్ పలుమార్లు అత్యాచారం చేశాడని, అందువల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పగా, ఆమె సోదరుడు సైతం ఇదే విషయం చెబుతూ, టింకూ తనను ఎన్నోసార్లు కొట్టాడని తెలిపాడు. ఈ ఆరోపణలపై టింకూను అదుపులోకి తీసుకొని విచారించగా, తొలుత ఆమె నాకు చెల్లితో సమానమని బుకాయించి, ఆపై మాటమార్చి, ఆమెను ఇష్టపడ్డానని, ముద్దులు మినహా హద్దులు మీరలేదని చెప్పాడు. భారతి మృతదేహాన్ని పరీక్షించిన వైద్యులు సైతం ఆమెపై అత్యాచారం జరగలేదని తేల్చడంతో అసలు వీరి ఆత్మహత్యకు కారణం ఏమిటన్న విషయంపై పోలీసులు తల పట్టుకుంటున్నారు. వీరి ఫోన్ కాల్స్ వివరాలు ఆరా తీస్తున్నామని, భారతీకి ఎవరైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? అనే విషయంలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న వారంతా ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ ను చదువుతున్నట్టుగా కారణాలు తెలపడం పోలీసుల ముందు మరో సవాల్ ను ఉంచింది. కేసును సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని పోలీసులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News