: నీటి వివాదంలోకి మమ్మల్ని లాగొద్దు... ఏపీ, తెలంగాణకు కర్ణాటక సూచన
కృష్ణా నదీ జలాల పంపకాలపై కృష్ణా ట్రైబ్యునల్ లో విచారణ కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఏర్పడిన నీటి వివాదంలో కర్ణాటక అసహనం వ్యక్తం చేసింది. ఈ వివాదంలోకి తమను, మహారాష్ట్రను లాగవద్దని పేర్కొంది. ప్రాజెక్టుల వారీ కేటాయింపులు, తెలంగాణ, ఏపీయే చూసుకోవాలని కోరింది. ఏపీ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో కేటాయించిన నీటినే రెండు రాష్ట్రాలు పంచుకోవాలని స్పష్టం చేసింది.