: అమృత్ సర్ ఎయిర్ పోర్టులో అమెరికా మహిళ అరెస్ట్... 25 బుల్లెట్లు స్వాధీనం
అమృత్ సర్ ఎయిర్ పోర్టులో కొద్దిసేపటి క్రితం బుల్లెట్ల కలకలం రేగింది. ఎయిర్ పోర్టుకు చేరుకున్న అమెరికాకు చెందిన ఓ మహిళను అదుపులోకి తీసుకున్న పోలీసులు అమె వద్దనున్న 25 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. అమృత్ సర్ నుంచి ఢిల్లీ వెళ్లేందుకు సదరు మహిళ ఎయిర్ పోర్టుకు చేరుకుంది. విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు సదరు మహిళను తనిఖీ చేయగా 25 బుల్లెట్లు బయటపడ్డాయి. వెనువెంటనే ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్ కు తరలించారు.