: ‘చట్టం’ వచ్చేదాకా... ఘర్ వాపసీ కొనసాగుతుంది: బీజేపీ ఎంపీ ఆదిత్యనాధ్ స్పష్టీకరణ
ఓ వైపు మదర్ థెరెసాపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై వివాదం కొనసాగుతుండగానే, బీజేపీ ఎంపీ ఆదిత్యనాథ్ మరో సంచలన ప్రకటన చేశారు. దేశంలో మత మార్పిడులపై చట్టం వచ్చేదాకా ఘర్ వాపసీ కొనసాగుతుందని ఆయన ప్రకటించారు. రోహ్ తక్ లో విశ్వహిందూ పరిషత్ ఏర్పాటు చేసిన హిందూ సమ్మేళన్ లో పాల్గొన్న సందర్భంగా ఆదిత్యనాథ్ ఈ మేరకు వ్యాఖ్యానించారు. దేశంలో ఓటు బ్యాంకు రాజకీయాలు, పేదరికం సమస్యలే కాదన్న ఆయన, ఘర్ వాపసీ మాత్రం కొనసాగి తీరుతుందని పేర్కొన్నారు. ఘర్ వాపసీ ప్రధాని నరేంద్ర మోదీ అభివృద్ధి మంత్రానికి ఏమాత్రం ఆటంకం కాదని ఆదిత్యనాథ్ సూత్రీకరించారు.