: రాజ్యసభలో స్వైన్ ఫ్లూ అంశాన్ని లేవనెత్తిన రాపోలు


ఇరు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, దేశంలోని పలు రాష్ట్రాల్లో స్వైన్ ఫ్లూ తన ప్రతాపాన్ని చూపిన సంగతి తెలిసిందే. ఈ మహమ్మారి బారిన పడి దేశ వ్యాప్తంగా వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా కాంగ్రెస్ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్ స్వైన్ ఫ్లూ అంశాన్ని లేవనెత్తారు. ప్రజల ప్రాణాలను హరిస్తున్న స్వైన్ ఫ్లూ నివారణకు అనేక చర్యలు చేపట్టాల్సి ఉందని, ఈ విషయాన్ని కేంద్రం సీరియస్ గా తీసుకోవాలని కోరారు. హోమియోపతి, ఆయుర్వేద, యునాని మందులను అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రానికి విన్నవించారు.

  • Loading...

More Telugu News