: పోలీసుల వేధింపులతో పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువకుడి బలవన్మరణం!


మరో రెండు రోజులుంటే ఆ యువకుడు పెళ్లికొడుకవుతాడు. అంతలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. వరంగల్ జిల్లా నెల్లికుదురు మండలం చెక్కముప్పారంలో నేటి ఉదయం చోటుచేసుకున్న ఈ ఘటనలో వీరన్న అనే యువకుడు బలవన్మరణం చెందాడు. ఈ నెల 27న జరగనున్న తన పెళ్లి ఏర్పాట్లలో నిమగ్నమైన వీరన్నను ఓ చోరీ కేసు విచారణ నిమిత్తం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఇంటికి చేరుకున్న వీరన్న ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వేధింపుల కారణంగానే వీరన్న ఆత్మహత్య చేసుకున్నాడని అతడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

  • Loading...

More Telugu News