: గ్యాంగ్ స్టర్ అబూసలేంకు నేడు శిక్ష విధించనన్న ముంబయి టాడా కోర్టు
ముంబయి రియల్టర్ ప్రదీప్ జైన్ హత్య కేసులో గ్యాంగ్ స్టర్ అబూసలేంకు ముంబయి టాడా కోర్టు శిక్ష ప్రకటించే అవకాశం ఉంది. 47 ఏళ్ల సలేం ప్రస్తుతం రాయ్ ఘడ్ జిల్లాలోని తలోజా సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్నాడు. కాగా జైన్ హత్య కేసు విచారణ సమయంలో అతనికి ఉరిశిక్ష విధించాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్ మొదట్లో డిమాండ్ చేశారు. పోర్చుగల్ పారిపోయిన అతడిని ఓ ఒప్పందం ప్రకారం భారత్ కు తీసుకురావడంతో జీవితకాల శిక్ష విధించాలని కోరారు. అయితే సలేంకు ఉరిశిక్ష విధించకూడదని, అలాచేస్తే రెండు దేశాల (భారత్-పోర్చుగల్) మధ్య ఒప్పందాన్ని ఉల్లంఘించినట్టేనని సలేం న్యాయవాది సుదీప్ పగోలా వాదించారు. ఆస్తి వివాదం నేపథ్యంలో మార్చి 7, 1995న ముంబయిలోని జైన్ జూహు నివాసం బయట హత్య జరిగింది. ఈ ఘటనలో సలేం సహా మరో ఇద్దరిని టాడా కోర్టు దోషులుగా ఈ నెల 16న నిర్ధారించింది.