: మదర్ థెరిసాపై మోహన్ భగవత్ వ్యాఖ్యలను సమర్థిస్తున్న శివసేన
జీవితాంతం నిరుపేదలకు సేవచేసి, నోబుల్ శాంతి పురస్కారం పొందిన మదర్ థెరిసాపై ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలకు శివసేన పార్టీ మద్దతు పలికింది. ఆయన అన్న మాటల్లో తప్పులేదని, కొంత నిజముందని పార్టీ అధికార పత్రిక సామ్నా సంపాదకీయంలో పేర్కొంది. విదేశాల నుంచి మిషనరీలుగా వస్తున్న క్రైస్తవ సంస్థలు దేశంలో చాలా మందిని క్రైస్తవ మతంలోకి మారుస్తున్నాయని వ్యాఖ్యానించింది. ముస్లింలు కత్తితో బెదిరించి మత మార్పిడి చేయిస్తుంటే... క్రైస్తవులు డబ్బు, సేవల పేరుతో ఇలా చేస్తున్నారని ఆరోపించింది. అయితే మనమందరం మదర్ సేవలను గుర్తించామని చెప్పింది. ఆమెలానే అనేకమంది సేవలు చేశారని, కానీ మత మార్పిడిలకు పాల్పడలేదని, ఇందుకు బాబా ఆమ్టే మంచి ఉదాహరణని అంటోంది.