: పోలీసుల అదుపులో విశాఖ నకిలీ బాబా
విశాఖ నగరంలో అమాయక ప్రజల నమ్మకాలతో ఆటలాడుకుంటున్న నకిలీ బాబా గుట్టు రట్టయింది. సంతానం లేని మహిళలు, వ్యాపారాల్లో నష్టపోయిన వారిని లక్ష్యంగా చేసుకొని, వారికి మాయ మాటలు చెబుతూ, లక్షల రూపాయలు సంపాదించిన సుబ్రహ్మణ్య ఫణిశర్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నకిలీబాబా ఖరీదైన భవనాలలో ఉంటూ, విలాసవంతమైన కార్లలో తిరుగుతూ జల్సా చేస్తున్నాడని పోలీసుల దృష్టికి వచ్చింది. ప్రస్తుతం ఈ నకిలీబాబాను విచారిస్తున్న పోలీసులు త్వరలోనే పలు కేసులను నమోదు చేయనున్నట్లు సమాచారం.