: విజయ్ మాల్యా కలల సౌధాన్ని స్వాధీనం చేసుకున్న బ్యాంకులు


ఒకప్పుడు లిక్కర్ కంపెనీ యునైటెడ్ బేవరేజస్ (యూబీ) నుంచి కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్, ఐపీఎల్ లో బెంగళూరు ఫ్రాంచైజీ వంటి ఎన్నో నిర్వహిస్తూ, ఎప్పుడూ విలాసవంతమైన జీవితం గడుపుతూ సొంత విమానాల్లో తిరిగే విజయ్ మాల్యా ప్రతిష్ఠ మరింత దిగజారింది. తాజాగా ముంబై ఎయిర్ పోర్ట్ సమీపంలో విల్ పార్లే వద్ద ఉన్న కింగ్‌ ఫిషర్ ఎయిర్‌ లైన్స్‌ అతిపెద్ద ఆస్తుల్లో ఒకటైన 'కింగ్‌ ఫిషర్ హౌస్'ను ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంకుల బృందం స్వాధీనం చేసుకుంది. తన కలల భవనమని మాల్యా చెప్పుకునే ఈ బిల్డింగ్ మొత్తం 17 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో వుంటుంది. దీని విలువ రూ.100 కోట్లుగా అంచనా. కాగా, మూతబడిన కింగ్ ‌ఫిషర్ ఎయిర్‌ లైన్స్ నుంచి 20 బ్యాంకులకు మొత్తం రూ.6,800 కోట్ల మేర రుణ బకాయిలు (వడ్డీ కాకుండా) రావాల్సి ఉంది. వీటిని చెల్లించడంలో మాల్యా విఫలం కాగా, కొన్ని బ్యాంకులు ఆయనపై ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారు ముద్రను కూడా వేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News