: ఆంధ్రా జడ్జి మాకొద్దంటూ మారుమోగిన మంచిర్యాల కోర్టు


రాష్ట్రం అధికారికంగా విడిపోయి 10 నెలలు కావొస్తున్నా, అధికారులు, ఉద్యోగుల మధ్య ప్రాంతీయ భేదాలు సమసిపోలేదు. మంచిర్యాల కోర్టులో విధులు నిర్వహిస్తున్న ఆంధ్రా ప్రాంతానికి చెందిన వ్యక్తి న్యాయమూర్తిగా ఉండటానికి వీల్లేదంటూ, న్యాయమూర్తులు పెద్దఎత్తున ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. "ఆంధ్రా జడ్జి గో బ్యాక్" అంటూ లాయర్లు నినాదాలు చేసి, నిరాహారదీక్షకు దిగారు. న్యాయవాదులు దీక్షలో ఉండగా కోర్టులోని న్యాయమూర్తులు కేసు విచారణలు చేపడుతుండటంతో న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కోర్టులోకి దూసుకెళ్లారు. కోర్టు గదులకు తాళాలు వేశారు. న్యాయమూర్తులు అడిషనల్ ఎస్పీ ఎస్.ఎం.విజయ్‌కుమార్‌కు సమాచారం తెలియజేయడంతో పోలీసులు కోర్టుకు వచ్చారు. పోలీసులు, న్యాయవాదుల మధ్య జరిగిన తోపులాటలో ఒక ఎస్సైకి స్వల్ప గాయాలైనట్టు తెలిసింది. న్యాయవాదులను కోర్టు బయటకు పంపి పోలీసు రక్షణ మధ్య కేసులు విచారించిన న్యాయమూర్తులు బయటకు వెళ్ళిపోగా, తమ నిరసనలు కొనసాగించాలని లాయర్లు నిర్ణయించారు.

  • Loading...

More Telugu News