: సీఎం కేసీఆర్ క్రీడానందం!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు క్రీడలంటే ఎంతో ఆసక్తి ప్రదర్శిస్తారు. అదే స్థాయిలో క్రీడాకారులను ప్రోత్సహిస్తారు. తాజాగా ఆయన హైదరాబాదులో గోల్కొండ మాస్టర్స్ గోల్ఫ్ చాంపియన్ షిప్ ను ప్రారంభించారు. అంతేగాదు, గోల్ఫ్ ఆడి అలరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అంతర్జాతీయ టోర్నమెంట్లకు హైదరాబాద్ ఆతిథ్యమిస్తుండడం పట్ల గర్విస్తున్నామని పేర్కొన్నారు. ఒకప్పుడు డంపింగ్ యార్డుగా ఉన్న ప్రదేశం ప్రస్తుతం ఉన్నతస్థాయి గోల్ఫ్ కోర్స్ గా అభివృద్ధి చెందిందని అన్నారు.