: యాదగిరిగుట్టకు రూ. 100 కోట్లు... పలు సూచనలు చేసిన కేసీఆర్
ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట అభివృద్ధి కోసం రానున్న బడ్జెట్లో రూ. 100 కోట్లను కేటాయించాలని టీఎస్ సీఎం కేసీఆర్ నిర్ణయించారు. యాదగిరిగుట్ట అభివృద్ధిపై సెక్రటేరియట్ లో ఉన్నతస్థాయి సమావేశాన్ని ఈరోజు కేసీఆర్ నిర్వహించారు. ఈ క్రమంలో, గుట్ట అభివృద్ధికి సంబంధించి పలు నమూనాలను కేసీఆర్ కు అధికారులు చూపించారు. ఈ సందర్భంగా అధికారులకు కేసీఆర్ పలు సూచనలు చేశారు. అందులో ముఖ్యమైనవి. * వందేళ్లనాటి పురాతన ఆలయాన్ని తలపించేలా గుట్ట డిజైన్ రూపొందించాలి. * దేవాలయ పునర్నిర్మాణం ఆగమశాస్త్ర నిబంధనలకు లోబడి ఉండాలి. * అద్భుతమైన శిల్పకళ ఉండాలి. * వారసత్వ ట్రస్టు ఏర్పాటు చేయాలి. * గుట్టపైకి వెళ్లేందుకు రెండు లైన్ల మార్గాన్ని నిర్మించాలి. * సెంట్రలైజ్డ్ పార్కింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. * దేవాలయం చుట్టూ ఉన్న 10 ఎకరాల స్థలంలో... 5 ఎకరాల్లో యాగశాల, కల్యాణమండపం ఏర్పాటు చేయాలి. * సకల సౌకర్యాలతో విశ్రాంతి గదులు, వసతి గృహాలు ఏర్పాటు చేయాలి.