: ముఖ్యమంత్రి హోదాలో ధర్నా చేసిన కేజ్రీవాల్
అరవింద్ కేజ్రీవాల్... భారత రాజధాని ఢిల్లీకి ముఖ్యమంత్రి. అయితేనేం, ఒక సాధారణ నిరసనకారుడిలా భూసేకరణ బిల్లుకు వ్యతిరేకంగా జరుగుతున్న ధర్నాలో కూర్చున్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారే రెండురోజుల దీక్ష చేపట్టగా, ఈ మధ్యాహ్నం అరవింద్ కేజ్రీవాల్ శిబిరానికి వచ్చి మద్దతు తెలిపారు. భూ సేకరణ చట్టానికి తాము వ్యతిరేకమని, దీనివల్ల రైతులకు మేలు కలుగకపోగా, కష్టాలు పెరుగుతాయని ఆయన అన్నారు.