: ఏబీఎన్ ను నిషేధించడంపై వాళ్లిద్దరూ స్పందించాలి: ఎర్రబెల్లి


తెలంగాణ రాష్ట్రంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వార్తా చానల్ పై నిషేధాన్ని కొనసాగిస్తుండడంపై టీటీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. ఏబీఎన్ పై నిషేధం పట్ల తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ప్రొఫెసర్ కోదండరాం స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. సచివాలయంలో మీడియా ప్రవేశంపై ఆంక్షలు విధించడం దురదృష్టకరమని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలను కేసీఆర్ మోసం చేస్తున్నారని విమర్శించారు. మార్చి 3వ తేదీన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కరీంనగర్ లో పర్యటించనుండగా, స్థానిక అంబేద్కర్ మైదానంలో అవసరమైన ఏర్పాట్లను ఎర్రబెల్లి తదితర నేతలు పర్యవేక్షించారు.

  • Loading...

More Telugu News