: సికింద్రాబాద్ ప్రశాంత్ థియేటర్లో అగ్ని ప్రమాదం!


సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని ప్రశాంత్‌ థియేటర్లో ఈ మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. నిత్యం ప్రయాణికులతో, షాపింగ్ కు వచ్చే ప్రజలతో రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో ప్రమాదం జరగడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ప్రస్తుతం ప్రశాంత్‌ టాకీస్‌ నుంచి మంటలు ఎగసి పడుతున్నాయి. థియేటర్‌ యాజమాన్యం అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారని తెలిసింది. అయితే, మధ్యాహ్నం 3:10 గంటల వరకూ ఫైర్ ఇంజన్లు రాలేదని సమాచారం. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సివుంది.

  • Loading...

More Telugu News