: ఇవాళ, రేపటిలో ఎంసెట్ పై తుది నిర్ణయం: మంత్రి గంటా
ఈరోజు లేదా రేపటిలోగా ఎంసెట్ ప్రవేశ పరీక్షపై తుది నిర్ణయం తీసుకుంటామని ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ మొండి వైఖరి వల్లే ఎంసెట్ పై గందరగోళం ఏర్పడిందని చెప్పారు. ఏపీ విద్యార్థులకు న్యాయం జరుగుతుందనే ఉమ్మడి పరీక్ష కోరుతున్నామన్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే తెలంగాణ ఉన్నత విద్యామండలి ఎంసెట్ షెడ్యూల్ ప్రకటించిన సంగతి విదితమే.