: వెస్టిండీస్ స్కోరంతా వారిద్దరిదే... చరిత్ర సృష్టించిన గేల్, శామ్యూల్స్
జింబాబ్వేతో జరుగుతున్న మ్యాచ్ లో వెస్టిండీస్ రికార్డులు ఒకదాని తర్వాత ఒకటి వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. వెస్టిండీస్ జట్టు సాధించిన స్కోరు మొత్తం ఇద్దరు బ్యాట్స్ మెన్ చేసిందే. జింబాబ్వే బౌలర్లపై విరుచుకుపడ్డ వెస్టిండీస్ స్టార్ బ్యాట్స్ మెన్ క్రిస్ గేల్ (147 బంతుల్లో 215), మార్లన్ శామ్యూల్స్ (156 బంతుల్లో 133 పరుగులు) జట్టు స్కోరును 372కు తీసుకెళ్లారు. 24 ఎక్స్ ట్రా రూపంలో రాగా మిగిలిన పరుగులన్నీ ఈ ఇద్దరే సాధించారు. గేల్ ఓపెనర్ గా బరిలో దిగి చివరి దాకా కొనసాగి చివరి బంతికి ఔటవగా, రెండు బంతులు ఆలస్యంగా క్రీజులోకి వచ్చిన శామ్యూల్స్ చివరి దాకా బ్యాటింగ్ చేసి నాటౌట్ గా నిలిచాడు.