: గేల్ సునామీ, శామ్యూల్స్ జోరు... సచిన్, ద్రావిడ్ల రికార్డు గాయబ్!


క్రిస్ గేల్ విధ్వంసానికి రికార్డులు బద్దలయ్యాయి. వన్ డే క్రికెట్ చరిత్రలో ఏ వికెట్ కైనా అత్యధిక భాగస్వామ్యం ఇంతవరకూ సచిన్, ద్రావిడ్ ల పేరిట ఉండగా... దాన్ని గేల్, శామ్యూల్స్ జోడీ తిరగరాసింది. కాన్ బెర్రా లో జింబాబ్వేతో జరుగుతున్న మ్యాచ్ లో గేల్ సునామీకి శామ్యూల్స్ సెంచరీ తోడవడంతో, 1999-2000 సీజన్లో భాగంగా హైదరాబాదులో న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో సచిన్, ద్రావిడ్ ల రెండో వికెట్ భాగస్వామ్యం 331 పరుగుల రికార్డు చెరిగిపోయింది. ఇక వరల్డ్ కప్ అయినా, వన్ డే క్రికెట్ చరిత్ర అయినా అత్యధిక పరుగుల భాగస్వామ్యం గేల్, శామ్యూల్స్ జోడీదే. వీరిద్దరూ కలసి 2వ వికెట్ కు 372 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. మొత్తం ఇన్నింగ్స్ లో 49.4 ఓవర్లు వీరిద్దరే ఆడటం గమనార్హం. ఇన్నింగ్స్ ఆఖరి బంతికి గేల్ 215 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అవుట్ అయ్యాడు. మరి కాసేపట్లో జింబాబ్వే 373 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగనుంది.

  • Loading...

More Telugu News