: లోక్ సభలో భూసేకరణ ఆర్డినెన్స్ బిల్లు... విపక్షాల వాకౌట్
లోక్ సభలో భూసేకరణ ఆర్డినెన్స్ బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ప్రభుత్వం తరపున కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రవేశపెట్టారు. ఇందుకు నిరసనగా విపక్షాలు వెంటనే సభ నుంచి వాకౌట్ చేశాయి. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించిన తరువాతే బిల్లులో సవరణలు చేశామని, బిల్లుపై విపక్షాలు రాద్దాంతం చేయడం తగదని ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు అన్నారు. బిల్లుపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. బిల్లు వల్ల రైతులకు ఎలాంటి నష్టం ఉండదని వెంకయ్య పేర్కొన్నారు.