: మదర్ థెరిస్సాపై మోహన్ భగవత్ వ్యాఖ్యలను సమర్థించిన ఆర్ఎస్ఎస్


నోబుల్ పురస్కార గ్రహీత, నిరుపేదలకు సేవచేసిన మదర్ థెరిస్సాపై తమ అధ్యక్షుడు మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలను ఆర్ఎస్ఎస్ సమర్థిస్తోంది. ఈ మేరకు సంస్థ అధికార ప్రతినిధి, సంఘ్ మాజీ అధినేత ఎంజీ వైద్య మాట్లాడుతూ, థెరిస్సా మిషనరీలు చేస్తున్న సేవ అనుమానాస్పందంగా ఉందని పేర్కొన్నారు. మరోవైపు భగవత్ వ్యాఖ్యలను మీడియా తప్పుగా పేర్కొందని, వాస్తవాలను వక్రీకరించిందని ఆర్ఎస్ఎస్ అంటోంది. మరోవైపు భగవత్ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. సంఘ్ ఒకటి చేస్తుంటే ప్రధాని మరొకటి చెబుతున్నారని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. ఈ మాటలతో ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారని పార్టీ ఎంపీ అశ్వనీ కుమార్ అన్నారు. అటువంటి మాటలనేముందు మదర్ థెరిస్సా సేవను మనమంతా గర్వంగా తీసుకోవాలని సూచించారు.

  • Loading...

More Telugu News