: వినియోగదారుడ్ని ఆకట్టుకోవడం ఎలా?
నిజమే... ఈ ప్రశ్న ప్రతి వ్యాపారస్తుడికి ఎదురయ్యేదే. కానీ, వినియోగదారులని ఆకర్షించటమే కష్టమంటారు వారు. అయితే ఇదేమంత కష్టం కాదని మైక్రోసాఫ్ట్ ఇండియా ఎండీ అమిత్ ఛటర్జీ అంటున్నారు. హైదరాబాదులోని ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆప్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో రెండు రోజుల పాటు జరగనున్న 'ఆర్ అండ్ డీ షోకేస్' కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా విద్యార్థులతో అమిత్ ఛటర్జీ మాట్లాడుతూ వినియోగదారులకి అత్యాధునిక సేవలు అందించడమే మైక్రోసాఫ్ట్ విజయ రహస్యమన్నారు. ఉత్పత్తి చేసే వస్తువును కాలానికి అనుగుణంగా మార్పు చేసినప్పుడే ప్రజాదరణ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.