: చంద్రబాబు పర్యటనను అడ్డుకోవాలని ఎమ్మార్పీఎస్ యత్నం... కార్యకర్తల అరెస్ట్
చిత్తూరు జిల్లాలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనను అడ్డుకోవాలని ప్రయత్నించిన ఎమ్మార్పీఎస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్సీ వర్గీకరణ అంశంపై బాబు నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నారని, ఇందుకు నిరసన వ్యక్తం చేయాలని ఈ ఉదయం పుంగనూరు నుంచి కార్యకర్తలు బయలుదేరారు. ఈలోగానే ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి మిద్ది వెంకటస్వామి సహా వంద మందిని పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. ఎమ్మార్పీఎస్ ఆందోళన నేపథ్యంలో మరోవైపు దళితవాడల్లో చెక్కుల పంపిణీని నిలిపివేశారు.