: రామకుప్పం చేరుకున్న చంద్రబాబు... మరికాసేపట్లో మిట్టపల్లి వాసులతో ముఖాముఖి


ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనలో భాగంగా కొద్దిసేపటి క్రితం రామకుప్పం చేరుకున్నారు. అక్కడి నుంచి మండలంలోని మిట్టపల్లి చేరుకోనున్న చంద్రబాబు ఆ గ్రామస్తులతో ముఖాముఖి కార్యక్రమంలో పాలుపంచుకోనున్నారు. నేటి ఉదయం హైదరాబాదు నుంచి బెంగళూరు వెళ్లిన ఆయన అక్కడి నుంచి రామకుప్పం చేరుకున్నారు. రెండు రోజుల పాటు కుప్పంలోనే పర్యటించనున్న చంద్రబాబు, నియోజకవర్గంలోని కుప్పం, రామకుప్పం, శాంతిపురం, గుడుపల్లి మండలాల్లో రోడ్ షోలు నిర్వహించనున్నారు.

  • Loading...

More Telugu News