: సామ్‌ సంగ్‌ ను దెబ్బకొట్టిన ఐబాల్!


నిన్నమొన్నటి వరకూ సెల్ ఫోన్, గాడ్జెట్ల అమ్మకాల్లో తిరుగులేని ఆధిక్యం చూపిన సామ్‌ సంగ్‌, తన ప్రాభవాన్ని కోల్పోతోంది. ఇటీవల స్మార్ట్ ఫోన్ అమ్మకాల్లో సామ్‌ సంగ్‌ ను మైక్రోమ్యాక్స్ వెనక్కు నెట్టగా, తాజాగా ట్యాబ్లెట్ల అమ్మకాల్లో ఐబాల్ దూసుకెళ్లింది. గడచిన అక్టోబర్-డిసెంబర్ మధ్యకాలంలో 15.6 శాతం మార్కెట్ వాటాతో ఐబాల్ తొలి స్థానం దక్కించుకుందని అంతర్జాతీయ పరిశోధన సంస్థ ఐడీసీ తెలిపింది. 2014 అక్టోబర్ వరకూ, 22.2 శాతం వాటాతో ఉన్న సామ్‌ సంగ్ డిసెంబెర్ నాటికి 12.9 శాతానికి పరిమితమైంది. 2013 నాలుగో త్రైమాసికంలో కేవలం 4.5 శాతంగా ఉన్న ఐబాల్ మార్కెట్ వాటా ఏడాది వ్యవధిలో మూడు రెట్లు పెరగడం గమనార్హం. మూడవ స్థానంలో మైక్రోమ్యాక్స్, ఆ పై డేటావిండ్, లెనోవో, హెచ్‌పీలు ఉన్నాయి. ఈ విషయమై సామ్‌ సంగ్ ప్రతినిధి స్పందిస్తూ, భారత టాబ్లెట్ మార్కెట్ అమ్మకాల్లో తామే అగ్రస్థానంలో ఉన్నామని వ్యాఖ్యానించారు. గత సంవత్సరంతో పోలిస్తే అమ్మకాలు 15 శాతం తగ్గి 35 లక్షల యూనిట్లకు చేరాయని సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు.

  • Loading...

More Telugu News