: దొంగతనం ఎలా చేయాలో చిన్నారులకు నేర్పుతున్న స్కూల్... విస్తుపోయిన పోలీసులు


విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించి, ఉత్తమ జీవితం గడిపేందుకు శిక్షణ ఇవ్వాల్సిన పాఠశాల దొంగతనాలను నేర్పిస్తోంది. ఒక దోపిడీ విషయంలో పోలీసులు వెళ్లి విచారిస్తే, విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, జార్ఖండ్ రాజధాని రాంచీ సమీపంలోగల సాహెబ్‌గంజ్ ప్రాంతంలో ఉన్న ఒక స్కూలు చిన్నపిల్లలకు దొంగతనం ఎలా చేయాలో నేర్పించడమే కాకుండా, శిక్షణ సమయంలో నెలకు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు ఉపకార వేతనం కూడా ఇస్తోంది. కేవలం ఖరీదైన సెల్‌ఫోన్లను దొంగిలించటం ఎలా? అనేదే ఆ ప్రత్యేక కోర్సు. ప్రస్తుతం ఐదుగురు పాఠశాల నిర్వాహకులు, కొంతమంది చిన్నారులను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. వీరంతా సాహెబ్‌గంజ్ ప్రాంతానికి చెందినవారని, సెల్‌ఫోన్ల మార్కెట్లో దొంగతనాలు చేయటంపై వారికి శిక్షణ ఇస్తున్నారని తమ విచారణలో తేలినట్టు పోలీసులు వివరించారు.

  • Loading...

More Telugu News