: తక్షణమే ఆ గదిని ఖాళీ చేయండి... టీడీపీ ఎంపీలకు షాకిచ్చిన లోక్ సభ స్పీకర్


పార్లమెంటులో టీడీపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయం ఉన్న ఐదో నెంబరు గదిని తక్షణమే ఖాళీ చేయాలని ఆ పార్టీ ఎంపీలకు లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ నిన్న ఆదేశాలు జారీ చేశారు. ఈ గది కోసం టీడీపీ ఎంపీలు, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలతో గతంలో ఘర్షణకు దిగిన సంగతి తెలిసిందే. సుదీర్ఘకాలంగా తాము ఆ గదిలోనే ఉంటున్నామని చెప్పిన టీడీపీ ఎంపీలు, ఖాళీ చేసే ప్రసక్తే లేదని నాడు తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. అయితే నిన్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా తొలిరోజునే స్పీకర్ వారికి షాకిచ్చారు. తన కార్యాలయానికి పిలిపించుకుని మరీ, టీపీపీ ఎంపీలకు స్పీకర్ ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. 16వ లోక్ సభలో సభ్యుల సంఖ్య ఆధారంగా ఐదో నెంబరు గదిని తృణమూల్ కాంగ్రెస్ కు కేటాయించిన స్పీకర్, టీడీపీకి మూడో అంతస్తులోని 135, 136 గదులను కేటాయించారు. ప్రస్తుతం ఆ గదుల్లో సీపీఎం పార్టీ కార్యాలయం ఉంది. దీనిని అవకాశంగా తీసుకున్న టీడీపీపీ నేత తోట నరసింహం, 'ముందు సీపీఎంతో సదరు గదులను ఖాళీ చేయించండి' అంటూ స్పీకర్ కు ఘాటుగానే సమాధానమిచ్చారట.

  • Loading...

More Telugu News