: డ్రగ్స్ ముఠాలో టాలీవుడ్ నిర్మాత, మరో ప్రముఖుడు... అరెస్ట్ చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు


తెలుగు సినీ పరిశ్రమలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగం కలకలం రేపుతోంది. నిన్న రాత్రి హైదరాబాదులోని జూబ్లీహిల్స్ లో మాదక ద్రవ్యాలను విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠాలో టాలీవుడ్ నిర్మాత సుశాంత్ రెడ్డితో పాటు మరో సినీ ప్రముఖుడు కూడా ఉన్నారు. నైజీరియాకు చెందిన ఐదుగురు వ్యక్తులతో పాటు శశాంక్ రెడ్డి, మరో ప్రముఖుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, వారి వద్ద నుంచి 80 గ్రాముల కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ ముఠాలో కీలక నిందితుడిని మాత్రం పోలీసులు పట్టుకోలేకపోయారు. సదరు నిందితుడు చాకచక్యంగా పోలీసుల నుంచి తప్పించుకున్నట్టు సమాచారం. అతడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.

  • Loading...

More Telugu News